![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -331 లో......సీతాకాంత్ బాంబ్ ని దూరంగా విసిరేస్తాడు. బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. అందరు దాన్ని చూసి షాక్ అవుతారు. చాలా థాంక్స్ అండి అందరి ప్రాణాలు కాపాడారని మైథిలీ అంటుంది. దాంతో రామలక్ష్మి అంటూ సీతాకాంత్ హగ్ చేసుకుంటాడు. నన్ను హగ్ చేసుకుంటావా? ఎవరు నువ్వు అంటూ సీతాకాంత్ చెంపచెల్ళుమనిపిస్తుంది మైథిలీ.
నువ్వు నా రామలక్ష్మివి అంటూ సీతాకాంత్ అంటాడు. అప్పుడే ఫణీంద్ర, సుశీల, రామ్ వస్తారు. మా నాన్నని కొడుతావా అని మైథిలీతో రామ్ అనగానే.. అతను మీ నాన్ననా అంటు రామలక్ష్మి షాక్ అవుతుంది. ఏదో మంచి వారు అనుకున్న కానీ ఇలా చేస్తారనుకోలేదు అని మైథిలీ అంటుంది. ఇలా చెయ్యడం తప్పు బాబు అని ఫణీంద్ర అంటాడు. అందరు అక్కడి నుండి వెళ్లిపోతారు.. మరొకవైపు శ్రీలత, సందీప్, శ్రీవల్లి లు ఆస్తులని అనుభవిస్తు తిని కూర్చొని ఉంటారు. చాలా బోరింగ్ గా ఉంది ఎక్కడికైనా వెళదాం.. ప్లాన్ చెయ్ అని శ్రీలత అంటుంది. దానికి సందీప్ సరే అంటాడు. రామలక్ష్మి అక్క చనిపోయి మంచి పని చేసింది. ఇప్పుడు చూడండి మనం ఎలా ఉన్నామోనని శ్రీవల్లి అంటుంది. ఆ తర్వాత మైథిలీ వాళ్ళు కార్ లో వస్తుంటారు. రామలక్ష్మి మైథిలీగా ఉండడానికి గల కారణం గుర్తు చేసుకుంటుంది. గాయలతో ఉన్న రామలక్ష్మిని ఫణీంద్ర, సుశీల ఇంటికి తీసుకొని వస్తారు. ఏం జరిగిందని ఫణీంద్ర అడుగగా.. రామలక్ష్మి జరిగింది మొత్తం చెప్తుంది. నేను మా అయన దగ్గరికి వెళ్తానని రామలక్ష్మి అంటుంది. అప్పుడే గోడపై ఉన్న ఫోటోని రామలక్ష్మికి చూపిస్తాడు. అక్కడ మైథిలీ ఫోటో ఉంటుంది. నా ఫొటో ఇక్కడ ఉంది ఏంటని రామలక్ష్మి అడుగుతుంది. నువ్వు కాదు నా మనవరాలు మైథిలీ. తను చనిపోయింది మళ్ళీ మీకు కొన్ని సంవత్సరాలకు ఎదురు పడుతుందని మా సిద్ధాంతి గారు చెప్పారు.. నువ్వు మా మనవరాలివి అని ఫణీంద్ర అంటాడు.
నేను వెళ్ళాలంటూ రామలక్ష్మి అంటుంది. లేదు మేం ఇంకా బ్రతికుంది నీ రాక కోసమే అంటూ ఫణీంద్ర అంటాడు. లేదు నేను వెళ్ళాలంటూ రామలక్ష్మి వెళ్ళిపోతుంది. తన భర్తని ఎలా కాపాడుకోవాలన్న ఆలోచనతో మళ్ళీ ఇక్కడికే వస్తుందని ఫణీంద్ర అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |